దొంగతనానికి వచ్చి..డోర్‌లో తల ఇరుక్కుని చనిపోయాడు

Varanasi Thief Dies After Head Stuck In Door To Steal Powerloom Center - Sakshi

ఒక ఇంటిలో దొంగతనం చేసేందుకు వచ్చిన ఒక దొంగ ఏమి దొరక్కా.. ఆ ఇంటిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన మరువక మునేపే అలాంటి మరో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. చోరీ చేసేందుకు వచ్చి డోర్‌లో తల ఇరుక్కుని చనిపోయాడు ఒక దొంగ. ఈ ఘటన వారణాసిలో సార్‌నాథ్‌ ప్రాంతంలోని డానియాల్‌పూర్‌లో చోటు చేసుకుంది. 

పోలీసులు తెలపిని కథనం ప్రకారం....నిజాం అనే వక్తి విద్యుత్‌ యంత్రాలతో పనిచేసే మగ్గం సెంటర్‌లోకి చోరబడేందుకు యత్నించాడు. వాస్తవానికి ఆ సెంటర్‌ సరైన పని లేక గత రెండు రోజులుగా మూతబడి ఉంది. ఐతే ఈ దొంగ ఆ సెంటర్‌లో చోరీ చేసేందుకు వచ్చాడు. ఐతే ఆ సెంటర్‌ను బద్దలుగొట్టే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్న తలుపుల్లో దొంగ తన తలను పెట్టడంతో అతడి తల ఇరుక్కుపోయింది.

ఆ తలుపులు పైన తాళం వేసి ఉందని తెలియక చోరబడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతని తల రెండు డోర్‌ల మధ్య ఇరుక్కుపోయింది, అతడి మిగతా శరీర భాగం బయటవైపు ఉండిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే మృదొ చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తిని పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న 30 ఏళ్ల జావేద్‌గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. 

(చదవండి: మహిళ చేతివాటం.. మాటల్లో దింపి రూ.10 లక్షల నెక్లెస్ కొట్టేసింది)

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top