వాకపల్లి అత్యాచార కేసు కొట్టివేత

Vakapalli molestation case dismissed - Sakshi

విచారణాధికారి వైఫల్యం వల్ల కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు తీర్పు 

బాధితులకు నష్టపరిహారం అందించాలని ఆదేశం

విచారణాధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు 

సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా)/ విశాఖ లీగల్‌: వాకపల్లి గిరిజన మహిళలపై అత్యాచారం కేసులో గురువారం తీర్పు వెలువడింది. విచారణ అధికారుల వైఫల్యం కారణంగా ఈ కేసును కొట్టివేస్తున్నట్లు విశాఖలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జడ్జి ఎల్‌.శ్రీధర్‌ ప్రకటించారు. బాధితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు విశాఖ జిల్లా న్యా య సేవా ప్రాధికార సంస్థ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

విచారణాధికారి శివానందరెడ్డి సరిగ్గా విచారణ చేయనందున శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి సిఫార్సు చేశారు. వివరాలు.. 2007 ఆగస్టు 20వ తేదీన అప్పటి విశాఖ జిల్లాలోని వాకపల్లిలో 11 మంది గిరిజన మహిళలు తమపై ప్రత్యేక పోలీస్‌ దళం(గ్రేహౌండ్స్‌) సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్ప డ్డారని ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ సంఘాలు ఉద్యమించాయి. అప్పటి ప్రభుత్వం 21 మంది పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.

బి.ఆనందరావును విచారణాధికారిగా నియమించగా కొంతకాలానికి ఆయన మరణించారు. ఆ తర్వాత శివానందరెడ్డి విచారణాధికారిగా వ్యవహరించారు. మొ త్తం 13 మందిని నిందితులుగా గుర్తించారు. ప్రాసిక్యూషన్‌ 38 మంది సాక్షులను విచారించింది. సుదీర్ఘ విచారణ తర్వాత కేసును కొట్టివేస్తూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కాగా, 11 మంది మహిళల్లో ఇద్దరు అనారో గ్య సమస్యలతో మరణించారు. అప్పటి ప్రభుత్వం నష్ట పరిహారం మంజూరు చేయగా.. బాధితులు నిరాకరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top