షాకింగ్.. 24 ఏళ్ల కుమారుడ్ని దారుణంగా కొట్టి చంపిన తండ్రి..

Uttar Pradesh Aligarh Father  Killed Son Crime News - Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్‌ జిల్లాలోని తారాపూర్ గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. కన్నతండ్రే కుమారుడ్ని దారుణంగా కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ఓ బ్యాగులో తీసుకెళ్లి వ్యవసాయ క్షేత్రంలో పూడ్చిపెట్టాడు.

ఈ ఘటనలో మృతుడ్ని రవి(24)గా గుర్తించారు పోలీసులు. అతని తండ్రి జయప్రకాశ్ నేరాన్ని అంగీకరించాడు. రవి వారం రోజులుగా కన్పించకపోవడంతో ‍అతని మామ శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే తన కుమారుడు తరచూ ఊర్లోవాళ్లతో గొడవపడుతున్నాడని, తనతో పాటు తల్లిపై కూడా దాడి చేస్తున్నాడని జయప్రకాశ్ విచారణలో పోలీసులకు చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నాడని, అందుకే ఆగ్రహంతో కొట్టి చంపినట్లు అంగీకరించాడు.

కుమారుడ్ని హత్య చేసిన అనంతరం జయప్రకాశ్ ఊరి వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. కేసు విచారణకు కూడా మొదట సహకరించలేదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతడే హత్యా నేరాన్ని అంగీకరించాడని వివరించారు.
చదవండి: అమ్మా.. నన్ను క్షమించు.. అక్కను బాగా చూసుకో..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top