అనుమానాస్పద స్థితిలో చిన్నారుల మృతి

నీటి గుంతలో తేలిన ఇద్దరి మృతదేహాలు
తెలకపల్లి (నాగర్‌కర్నూల్): అనుమానాస్పద స్థితిలో సంపు గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మండలంలోని గడ్డంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ సీఐ గాంధీ నాయక్, తెలకపల్లి ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. గడ్డంపల్లికి చెందిన తలుపునూరు తిరుమలయ్య, భాగ్యలక్ష్మీ దంపతులకు కిట్టు(5) అమ్ములు (3) ఇద్దరు సంతానం. మంగళవారం సాయంత్రం తిరుమలయ్య అన్న అగు లక్ష్మయ్య ఇంటి ఎదుట ఉన్న సంపు గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో కుటుంబసభ్యులు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను పరిశీలించారు. ఇద్దరు చిన్నారులు ఒకే దగ్గర మృతిచెందడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, చిన్నారుల మృతదేహాలను నాగర్‌కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియనున్నాయని ఎస్‌ఐ తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి