Mumbai TV Actress Accuses Pilot Of Rape, Molestation Case Registered - Sakshi
Sakshi News home page

టీవీ నటిపై అత్యాచారం: పోలీసులకు ఫిర్యాదు

Jan 19 2021 10:47 AM | Updated on Jan 19 2021 5:39 PM

TV Actress Filed Molestation Case On Pilot To Pretext Of Marriage - Sakshi

ముంబై: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి‌ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ముంబైకి చెందిన టీవీ నటి మంగళవారం ఓషివారా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో బాధిత నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ముంబైకి చెందిన టీవీ నటికి పైలట్‌‌ మ్యాట్రియోనియల్‌ సైట్‌ ద్వారా పరిచయమయ్యాడు. వీరిద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకోవడం, సోషల్‌ మీడియాలో చాట్‌ చేసుకునేవారు. ఈ క్రమంలో వారి మధ్య మరింత పరిచయం ఎర్పడింది. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం పైలట్‌ ఆమెను కలవాలని కోరడంతో అతడిని ఆమె ఇంటికి పిలిచింది. (చదవండి: వివాహేతర సంబంధం: భర్త దారుణ హత్య)

అయితే అతడు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత నటి ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం కొద్ది రోజుల తర్వాత తనని పెళ్లి చేసుకోమని అడగడంతో నిందితుడు ఆమెతో మాట్లాడటం మనేశాడు. దీంతో తనపై అత్యాచారం చేసి, వివాహం చేసుకోవడానికి నిరాకరించాడంటూ బాధిత నటి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సదరు పైలట్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఓషివారా పోలీసు అధికారికి పేర్కొన్నారు. (చదవండి: విషాదం.. పెళ్లయిన ఆర్నెళ్లకే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement