వీడియోలను అడ్డం పెట్టుకుని.. 250 మందిని ట్రాప్‌ చేశారు

Traping Women On Social Media Case Two Mans Arrested - Sakshi

సోషల్‌ మీడియాతో మహిళలను మోసగిస్తున్న యువకులు

చాటింగ్‌ చేసి నగ్న వీడియోలు తీసుకుని వేధింపులు

డబ్బులు ఇస్తేనే వాటిని డిలీట్‌ చేస్తామని బెదిరింపులు

ఢిల్లీలో అరెస్ట్‌ చేసిన పోలీసులు

సాక్షి, న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాను కొందరు దుర్వినియోగించుకుంటున్నారు. సమాజానికి చేటుగా మారిన వారితో ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి వేధింపులు తాళలేక కొందరు బలవన్మరణాలకు కూడా పాల్పడిన సంఘటనలు కూడా చూశాం. తాజాగా మరో సంఘటన అలాంటి చోటుచేసుకుంది. నగ్న ఫొటోలకు అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తామని వేధింపులకు పాల్పడుతున్నారు. వేధిస్తున్న యువకులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

డీసీపీ ప్రణవ్‌ తాయల్‌ వెల్లడించిన వివరాలప్రకారం .. జహూల్‌ (25), మీనాజ్‌ (23) సులువుగా సంపాదించాలని భావించి మార్ఫింగ్‌ మార్గాన్ని ఎంచుకున్నారు. మహిళలు, యువతుల ఫొటోలను నగ్నం మార్చి వారిని వేధిస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారి బారిన ఏకంగా 250 మంది మహిళలు.. యువతులు పడ్డారు. సోషల్‌ మీడియాలో నంబర్లు తీసుకుని అనంతరం నగ్నంగా నటించమని కోరుతారు. ఆమెను రెచ్చగొట్టేట్టు చేసి తమ పని చేసుకుంటారు. అయితే ఆ వీడియోలను రికార్డు చేస్తారు. వాటిని డిలీట్‌ చేసేందుకు రూ.వేల నుంచి లక్షల్లో డిమాండ్‌ చేస్తున్నారు.

లేకపోతే యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలలో పోస్టు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతారు. పరువు పోతుందనే భయంతో మహిళలు వారు అడిగినంత ముట్టచెబుతున్నారు. వారి ఆగడాలు తీవ్రమవడంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మేవాట్‌లో జహుల్‌, మీనాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిని పట్టుకునేందుకు నిందితుల పద్ధతిలోనే పోలీసులు వెళ్లారు. ఓ యువతి మాదిరిగా నటించి చాట్‌ చేయడంతో వారు నంబర్‌ పంపడంతో రంగంలోకి దిగి ఆ ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top