రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకుల మృతి 

Three youth died on the spot in an road accident, which occurred on National Highway no. 65 at Dharmojigudem of Choutuppal m - Sakshi

రామంతాపూర్‌లో విషాదఛాయలు

సాక్షి, రామంతాపూర్‌: నగర శివారులోని చౌటుప్పల్‌ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణానికి గురయ్యారు. వారంతా రామంతాపూర్‌ నెహ్రూనగర్‌లోని ఎలక్ట్రికల్‌ గృహోపకరణాల అధీకృత సర్వీస్‌ సెంటర్‌లో ఏసీ టెక్నీషియన్‌లుగా పనిచేస్తున్న యువకులు కావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకుకున్నాయి. వివరాలివీ... హరీష్‌(25), సల్మాన్‌(24), ఆసీఫ్‌(24)లు శుక్రవారం రాత్రి హరీష్‌ స్వగ్రామంలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు. శనివారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో బైక్‌పై నగరానికి వస్తున్నారు.

ఈ క్రమంలో చౌటుప్పల్‌ ధర్మాజిగూడెం వే బ్రిడ్జి వద్ద ఓ లారీ రివర్స్‌ చేస్తూ వారి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సర్వీస్‌ సెంటర్‌ పై అంతస్తులో నివసిస్తూ పనిచేసుకుంటున్న హరీష్‌ స్వగ్రామం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి. సల్మాన్‌ది గజ్వేల్‌. మేడ్చల్‌ జిల్లా గౌరవరంకు చెందిన ఆసీఫ్‌ సర్వీస్‌ సెంటర్‌ యజమాని సలీంకు సమీప బంధువు కావడంతో రామంతాపూర్‌లోని భరత్‌నగర్‌లోని ఆయన గృహంలోనే ఉంటున్నాడు. ఆసీఫ్‌ అంత్యక్రియలు రామంతాపూర్‌లో నిర్వహించారు.
చదవండి: బైక్ పై వెళ్తున్న దంపతులపై అకస్మాత్తుగా దూసుకెళ్లిన గేదె

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top