స్నేహితుడి సోదరితో పరిచయం.. లైంగిక దాడి, ఆపై ట్యాబ్లెట్స్‌ ఇచ్చి..

Ten years Prison Imposed Who Molested Young Woman in Kakinada - Sakshi

సాక్షి, కాకినాడ: యువతికి మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడి పెళ్లి చేసుకోవడానికి ముఖం చాటేసిన నయవంచకుడికి పదేళ్ల జైలు, రూ.వేయి జరిమానా విధిస్తూ కాకినాడ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎల్‌.వెంకటేశ్వరరావు బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. మారేడుమిల్లి చర్చివీధికి చెందిన సురబోయిన పవన్‌కుమార్‌ తన స్నేహితుడి సోదరితో పరిచయం పెంచుకున్నాడు. ఆ నర్సింగ్‌ చదవడానికి 2015లో  కాకినాడకు వచ్చింది. దీంతో పవన్‌కుమార్‌ తరచూ కాకినాడ వచ్చి మాయమాటలు చెప్పి వంచించాడు. ఆ యువతి 2015లో గర్భం దాల్చగా దాని విచ్ఛిత్తికి టాబ్లెట్లు ఇచ్చాడు.

చదవండి: (28 రోజులుగా కోమాలో.. వయాగ్రా అధిక మొత్తంలో ఇవ్వడంతో..)

ఆరు నెలల తరువాత పెళ్లి చేసుకుంటానని ఆమెకు హామీ ఇచ్చాడు. కాగా 2016లో పవన్‌ కుమార్‌ను పెళ్లి చేసుకోవాలని యువతి నిలదీయగా అతడు నిరాకరించాడు. దీంతో 2016లో మారేడుమిల్లి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా లైంగికదాడికి పాల్పడినందుకు ఐపీసీ 376 పాటు ఐపీసీ 417, 313, 315, 506, పోక్సో చట్టం కింద కేసును ఎస్సై డి.రాంబాబు నమోదు చేశారు. కోర్టు విచారణలో పవన్‌కుమార్‌ నేరం చేసినట్టు రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. ఏపీపీ ఎండీ అక్బర్‌ ఆజం ప్రాసిక్యూషన్‌ నిర్వహించారు. 

చదవండి: (భర్త, కుమారుడి ఎదుటే మహిళపై అత్యాచారం..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top