మహిళ మృతదేహంపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం

Teenager Assasinate Elder Woman And Molestation In Rajastan - Sakshi

రాజస్థాన్‌లో 60 ఏళ్ల మహిళపై దారుణం

అత్యాచారానికి యత్నించగా ప్రతిఘటన మహిళ

హత్య చేసిన అనంతరం అఘాయిత్యం

మృతదేహంపై కోరిక తీర్చుకున్న టీనేజర్‌

జైపూర్‌: దేశంలో మహిళలకు రక్షణ లేదని ఇటీవల ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. అత్యాచార భారతంగా మారింది. తాజాగా ఓ టీనేజర్‌ తన అవ్వ వయసు ఉన్న మహిళపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆ యువకుడు తట్టుకోలేక ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహంపై అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
చదవండి: విద్యార్థినికి అవమానం.. పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా?

ఆ రాష్ట్రంలోని పిలిబంగ పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువకుడు సురేంద్రకుమార్‌. హనుమాన్‌ఘర్‌ ప్రాంతంలో ఓ మహిళ (60) ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. భర్త మూడేళ్ల కిందట మృతి చెందాడు. ఆమెకు పిల్లలు లేరు. ఒంటరిగా ఉన్న ఆమెపై సురేంద్ర కన్నేశాడు. ఈనెల 15వ తేదీన అర్ధరాత్రి ఇంట్లోకి దూరి ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో సురేంద్ర ఆమెను దారుణంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. అంతటితో ఊరుకోకుండా ఎలాగైనా కోరిక తీర్చుకోవాలని ఆమె మృతదేహాన్ని అత్యాచారం చేశాడు.
చదవండి: ప్రేమజంటను మూడు రాష్ట్రాలను తిప్పి.. ముప్పుతిప్పలు పెట్టి..

అయితే మృతురాలి బావ వచ్చి చూడగా ఆమె విగతజీవిగా పడి ఉంది. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే సురేంద్ర ఆమె ఇంట్లోకి వెళ్లడం కొందరు చూసిన గ్రామస్తులు పోలీసులకు విషయం చెప్పారు. దీంతో సురేంద్రకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘోర ఘటనను విన్నవారంతా సమాజం ఎటుపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లి, అమ్మమ్మ వయసు గల మహిళపై ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లాడు ఇంత దారుణానికి ఒడిగట్టడం జీర్ణించుకోలేకపోతున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని స్థానిక మహిళలు డిమాండ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top