
ఆత్మహత్యకు యత్నించిన దంపతులతో మాట్లాడుతున్న పోలీసులు
తాడికొండ(గుంటూరు జిల్లా): వెలగపూడిలోని ఏపీ సచివాలయం వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శనివారం కలకలం రేపింది. ఇద్దరు పిల్లలు సహా సచివాలయం వద్దకు చేరుకున్న అరిగెల నాగార్జున, భవాని దంపతులు కుటుంబం మొత్తం పురుగు మందు తాగి ఆత్మహత్యకు చేసుకునేందుకు యత్నించారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు తహసీల్దార్ చంద్రశేఖర్ తమవద్ద రూ.కోటి తీసుకొని 33 ఎకరాల పొలం ఆన్‌లైన్ చేస్తానని మోసం చేశారని ఆరోపించారు. అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్న తనకు ఆత్మహత్యే శరణ్యమని బాధితుడు వాపోయినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న తుళ్ళూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు యత్నించిన దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వివరాలు నమోదు చేసుకొని తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
చదవండి:
విషాదం మిగిల్చిన ‘దీపం’: బతికుండగానే..
తిరుమల మెట్లెక్కుతూ బీటెక్ విద్యార్థి మృతి