ఆరుగురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు: ఏపీ డీజీపీ | Six Maoist Leaders Arrested Andhra Odisha Border | Sakshi
Sakshi News home page

ఆరుగురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు: ఏపీ డీజీపీ

Aug 12 2021 1:39 PM | Updated on Aug 12 2021 6:40 PM

Six Maoist Leaders Arrested Andhra Odisha Border - Sakshi

సాక్షి,అమరావతి: ఏపీ-ఒడిశా సరిహద్దులో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు నిరంతరం కూంబింగ్‌ సత్పలితాలనిస్తోంది. నిషేధిత మావోయిస్టు (సీపీఐ) పార్టీకి చెందిన ఆరుగురు కీలక సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ గురువారం  మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. గత నెలలో మావోయిస్ట్ కమిటీ సభ్యుడు లోంగిపోయాడని.. ఈ రోజు మరో ఆరుగురు మావోయిస్టులు సరెండర్ అయ్యారని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ తెలిపారు. గతంలో సమస్యలపై మావోయిస్టులు వచ్చి స్థానికులతో మాట్లాడేవారు, ఇప్పుడు ప్రభుత్వం నుంచి సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతంలో 20 వేల కుటుంబాలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని,ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేస్తోంది డీజీపీ వివరించారు.

మహిళలకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ..ఆదివాసిగూడెంలకు సైతం చేరుతున్నాయని గౌతమ్‌సవాంగ్‌ వాఖ్యనించారు. గతంలో 8 మావోయిస్టు కమిటీలు ఉంటే ప్రస్తుతం నాలుగు ఉన్నాయి.. మావోయిస్టులు రక్తపాతం ద్వారా సాధించేదేమీ లేదని స్పష్టం చేశారు. అనేక మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారని పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థ బాగా పని చేస్తోంది.. నేరుగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గతంలో బాక్సైట్‌ సమస్య ఉండేది.. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక బాక్సైట్ జీవోలను రద్దు చేసిందని ఆయన అన్నారు. పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని  డీజీపీ తెలిపారు.
లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు.. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement