ఎయిర్ పోర్టులో డ్రగ్స్‌ కలకలం.. జింబాబ్వే మహిళ వద్ద రూ. 60 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ | Rs 60 Crore Worth Drugs Recovered at Mumbai Airport  | Sakshi
Sakshi News home page

ఎయిర్ పోర్టులో డ్రగ్స్‌ కలకలం.. జింబాబ్వే మహిళ వద్ద రూ. 60 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

Feb 13 2022 4:28 PM | Updated on Feb 13 2022 5:53 PM

Rs 60 Crore Worth Drugs Recovered at Mumbai Airport  - Sakshi

సాక్షి, ముంబై: దేశంలో మరోసారి భారీ స్థాయిలో మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. మహిళా ప్రయాణికురాలి వద్ద దొరికిన దాదాపు రూ. 60 కోట్ల విలువైన డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు డ్రగ్స్ తరలిస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో విమానాశ్రయంలో వారు తనిఖీలు నిర్వహించారు.

 ఈ సోదాల్లో భాగంగా జింబాబ్వేకు చెందిన ఓ ప్రయాణికురాలి వద్ద మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడు డ్రగ్స్ ను ట్రాలీ బ్యాగ్​తో పాటు రెండు ఫైల్ ఫోల్డర్లలో దాచిపెట్టి తరలిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపుగా రూ. 60 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement