రాజ్‌ కుంద్రా బెయిల్‌ తిరస్కరణ.. 14 రోజుల జ్యూడిషియల్‌ కస్టడీ

Raj Kundra Denied Bail And Sent To Judicial Custody For 14 Days - Sakshi

ముంబై: పోర్నోగ్రఫి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నా రాజ్‌ కుంద్రా బెయిల్‌ పిటీషన్‌ విచారణను తిరస్కరించిన కోర్టు.. అతడికి 14 రోజుల పాటు జ్యూడిషియల్‌ కస్టడీ విధించింది. రాజ్‌ కుంద్రా పోలీసు కస్టడీ మంగళవారంతో ముగిసింది. రాజ్‌ కుంద్రా మార్చిలోనే తన అరెస్ట్‌ను ఊహించాడని.. ఈ క్రమంలో తన ఫోన్‌ను మార్చాడని క్రైమ్ బ్రాంచ్‌ అధికారులు భావిస్తున్నారు. రాజ్‌ కుంద్రా-శిల్పా శెట్టి దంపతుల బ్యాంక్ ఖాతాలను పరిశీలించడానికి క్రైమ్ బ్రాంచ్ అఫ్టికల్స్ స్వతంత్ర ఆడిటర్‌ను కూడా నియమించుకున్నట్లు సమాచారం.

నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌ కుంద్రాను ఈ నెల 19న పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అశ్లీల చిత్రాలు తెరకెక్కిస్తూ.. వాటిని హాట్‌ షాట్స్‌ యాప్‌ ద్వారా రిలీజ్‌ చేసేవాడని రాజ్‌ కుంద్రాపై ఆరోపణలు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రెండు రోజుల క్రితం శిల్పా శెట్టిని కూడా ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఆమె పాత్రపై దర్యాప్తు చేశారు పోలీసులు. 

ఈ కేసులో  వియాన్ ఇండస్ట్రీస్‌కు చెందిన నలుగురు ఉద్యోగులు కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారు. అంతేకాక రాజ్‌ కుంద్రా పోర్న్‌ వీడియోల రాకెట్టుకు సంబంధించి మొదటి నుంచీ వార్తల్లో ఉన్న నటి-మోడల్‌ షెర్లిన్ చోప్రాకు సమన్లు జారీ అయ్యాయి. జూలై 27, ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని  క్రైమ్ బ్రాంచ్  ప్రాపర్టీ సెల్  నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top