ప్రేమ వ్యవహరం నడుపుతోందని.. మైనర్‌ బాలికకు ప్రిన్సిపాల్‌ వేధింపులు | Principal Molesting Minor Girl Over Love Affair In Assam | Sakshi
Sakshi News home page

ప్రేమ వ్యవహరం నడుపుతోందని.. మైనర్‌ బాలికకు ప్రిన్సిపాల్‌ వేధింపులు

Dec 27 2021 5:24 PM | Updated on Dec 27 2021 6:21 PM

Principal Molesting Minor Girl Over Love Affair In Assam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

గువాహటి: అస్సాంలో దారుణం చోటు చేసుకుంది. యువకుడితో ప్రేమ వ్యవహరం నడుపుతోందని ఎనిమిదో తరగతి బాలికను ప్రిన్సిపాల్‌ వేధించాడు. దీంతో మనస్థాపానికి గురైన..  యువతి పాఠశాలలోని ఐదో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. డిసెంబరు 24న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక పాఠశాలలోని 13 ఏళ్ల బాలిక, మరో యువకుడిని ప్రేమిస్తోందని కొంత కాలంగా ప్రిన్సిపాల్‌ వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతటితో ఆగకుండా బాలిక పట్ల.. యువకుడి తల్లిదండ్రుల ముందే అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన బాధిత బాలిక పాఠశాల బిల్డింగ్‌ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో.. వెంటనే పాఠశాల సిబ్బంది బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఈ మేరకు బాలికను అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. బాలిక చికిత్స తీసుకుంటూ.. డిసెంబరు 26న ఆసుపత్రిలో మృతి చెందింది. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు ప్రిన్స్‌పాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా,  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రిన్సిపాల్‌ పరారీలో ఉన్నట్లు గుర్తించారు. 

చదవండి: ఢిల్లీలో పంజాబ్‌ హీట్‌.. అమిత్‌షాతో అమరీందర్‌ సింగ్‌ భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement