టాటూలు వేస్తానని ఏడుగురు మహిళలతో ఒంటరిగా స‍్టూడియోలో.. | Physical Harassment On Woman In Kerala | Sakshi
Sakshi News home page

టాటూల నెపంతో స్టూడియోలో.. ఏడుగురు మహిళలతో..

Mar 6 2022 12:59 PM | Updated on Mar 6 2022 4:07 PM

Physical Harassment On Woman In Kerala - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం: దేశంలో మహిళలు, యువతులపై రోజురోజుకు లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. ప్రతీరోజు ఏదో ఒక చోట వారు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. మహిళలపై వేధింపులు తగ్గించేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలను తీసుకువచ్చినా నేరాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. 

తాజాగా కేరళలో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కామాంధుడి ఏగుగురు యువతులను నమ్మించి అకృత్యానికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. కేరళలోని ఎటప్పళ్లిలో సుజీష్‌ అనే వ్యక్తి టాటూలు వేసే స్టూడియోను రన్‌ చేస్తున్నాడు. దీంతో ఓ యువతి(18) టాటూలు వేసుకునేందుకు అతడి స్టూడియోకి వెళ్లింది. టాటూ వేసే నెపంతో ఆ కామాంధుడు సదరు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు సోషల్‌ మీడియాలో తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె పోస్టు ఆధారంగా.. ఎర్నాకుళం పోలీసులు సుజీష్‌పై కేసు నమోదు చేశారు. 

ఈ విషయం కాస్తా బయటకు రావడంతో అతడి చేతిలో మోసపోయిన మరో ఆరుగురు మహిళలు పోలీసులను ఆశ్రయించారు. అంతకు ముందు వారిపై జరిగిన లైంగిక వేధింపులను బహిర్గతం చేశారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్టు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement