పావని మిస్సింగ్‌ కేసు విషాదాంతం | Pavani Missing Case In Chittoor Turns Tragedy | Sakshi
Sakshi News home page

పావని మిస్సింగ్‌ కేసు విషాదాంతం

Dec 22 2020 2:27 PM | Updated on Dec 22 2020 3:12 PM

Pavani Missing Case In Chittoor Turns Tragedy - Sakshi

సాక్షి, చిత్తూరు: వారం రోజుల క్రితం అదృశ్యమైన యువతి పావని కేసు విషాదాంతమైంది. ఓ వ్యవసాయ బావిలో మంగళవారం ఆమె మృతదేహం లభ్యమైంది. రామకుప్పం (మ) మునింద్రంకు చెందిన పావని వారం నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. కాగా, పావని మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె స్నేహితుడు మునిరత్నమే పావనిని హత్య చేశాడని  ఆరోపిస్తూ అతని ఇంటిపై దాడి చేశారు. అయితే, వారు దాడికి దిగిన సమయంలో పరారీలో ఉన్న నిందితుడు మునిరత్నం ముణేంద్రం సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement