జీడిమెట్లలో ఘోరం: అగ్నిప్రమాదంలో మహిళ సజీవ దహనం | One Women Life Ends In Jeedimetla Fire Accident | Sakshi
Sakshi News home page

జీడిమెట్లలో ఘోరం: అగ్నిప్రమాదంలో మహిళ సజీవ దహనం

Jul 18 2021 3:33 AM | Updated on Jul 18 2021 3:33 AM

One Women Life Ends In Jeedimetla Fire Accident - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

జీడిమెట్ల: ల్యాబ్‌కు సంబంధించిన ఫర్నిచర్‌ తయారుచేసే ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా, మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. జీడిమెట్లకు చెందిన సురేశ్‌కుమార్‌ అనే వ్యక్తి జీడిమెట్ల ఫేజ్‌ -5లో ఆర్ట్‌ ఫ్యాబ్రికేషన్స్‌ పేరిట ఇండస్ట్రీ, క్లినికల్‌ ల్యాబ్‌ ఎక్విప్‌మెంట్‌ తయారు చేసే పరిశ్రమను నడుపుతున్నాడు. శనివారం పరిశ్రమలో పనిచేసే 60 మంది కార్మికులు పనిచేస్తుండగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో రెండో అంతస్తులోని ల్యాబ్‌ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అక్కడున్న వారంతా పరుగులు తీశారు. ల్యాబ్‌లో అపురూ పకాలనీకి చెందిన యశోద (40), లక్ష్మి (28), కృష్ణవేణి (57) క్లీనింగ్‌ పనులు చేస్తున్నారు. యశోద మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందింది. లక్ష్మి, కృష్ణవేణి గాయపడగా వారిని చికిత్స కోసం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. జీడిమెట్ల పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకుని 2 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పేశారు.

పరిశ్రమకు అనుమతుల్లేవు..
ఫ్యాబ్రికేషన్స్‌ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి అనుమతుల్లేవని ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పరిశ్రమలో మంటలను నియంత్రించేం దుకు ఫైర్‌ సేఫ్టీ పరికరాలు కూడా లేవని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన మహిళ కుటుంబానికి నష్టప రిహారం ఇప్పించాలని స్థానికులు కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement