దారుణం: ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం | Old Age Man Molested On Minor Girl In Khammam | Sakshi
Sakshi News home page

దారుణం: ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం

Aug 26 2021 8:38 AM | Updated on Aug 26 2021 8:38 AM

Old Age Man Molested On Minor Girl In Khammam - Sakshi

పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడు దీప్లానాయక్‌

సాక్షి, నేలకొండపల్లి(ఖమ్మం): మోటాపురంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మోటాపురానికి చెందిన భార్యాభర్తలు బుధవారం తమ ఆరేళ్ల కుమార్తెను ఇంట్లో వదిలి కూలీ పనికి వెళ్లారు. ప్రతీరోజు ఇలాగే వెళ్తుండగా పాప చుట్టుపక్కల పిల్లలతో ఆడుకునేది. దీనిని ఆసరాగా చేసుకుని వారి ఎదురు ఇంట్లో ఉండే దీప్లానాయక్‌(60) ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కూలీ పనులకు వెళ్లొచ్చాక ఆమె తల్లిదండ్రులకు చిన్నారి కనిపించకపోవటంతో గ్రామం అంతా వెతికారు.

అయినా దొరకపోవడంతో విలపిస్తూ అనుమానంతో దీప్లానాయక్‌ ఇంట్లోకి వెళ్లి చూడగా వివస్త్రగా పడి ఉంది. దీంతో విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు సీడీపీఓ బాలాత్రిపుర సుందరికి సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా నేలకొండపల్లి ఎస్సై జి.అశోక్‌రెడ్డి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాలికను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

చదవండి: ప్రేమించాలని ‘యువతి’ వేధింపులు..

Advertisement
 
Advertisement
Advertisement