దుబాయ్‌లో నిజామాబాద్‌ వాసి అరెస్ట్ | Nizamabad Migrant labour Talla Prabhakar Arrested In Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో నిజామాబాద్‌ వాసి అరెస్ట్

Nov 15 2020 1:16 PM | Updated on Nov 15 2020 1:43 PM

Nizamabad Migrant labour Talla Prabhakar Arrested In Dubai - Sakshi

సాక్షి, నిజామాబాద్‌:  జిల్లాలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన తాళ్ల ప్రభాకర్‌ అనే వలస కూలీని షార్జా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. కరోనా ప్రభావంతో ప్రభాకర్‌ పని చేస్తున్న కంపెనీలో వేతనాలు లేక కనీసం భోజనం సైతం లేక బయట మరో చోట పనులు చేసుకుంటున్నాడు. అయితే పాస్‌ పోర్టు, కంపెనీ వీసాలో సరైన వివరాలు చెప్పకుండా బయట తిరుగుతున్నాడనే అభియోగాలపై షార్జా పోలీసలు అతన్ని అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు కుటుంబ సభ్యులు గల్ఫ్ వెల్ఫేర్ కల్చరల్ అధ్యక్షుడు పాట్కూరి బసంత్ రెడ్డిని కలిసి ప్రభాకర్‌ను విడిపించాలని కోరారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ప్రభాకర్‌ను విడిపించి తమ స్వగ్రామానికి చేరేలా చూడాలని బసంత్‌రెడ్డిని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement