నవ వరుడి విషాదాంతం

Newly Wed Man Deceased By Electric Shock In Hosur Karnataka - Sakshi

హోసూరు/కర్ణాటక: అతనికి నాలుగు నెలల క్రితమే పెళ్లయింది. ఇంకా అచ్చటా ముచ్చట తీరలేదు. అంతలోనే విధి బలి తీసుకుంది. ఈ విషాద ఘటన మత్తిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. హోసూరు సమీపంలోని బేళగొండపల్లి గ్రామానికి చెందిన గురురాజ్‌(24)కు నాలుగు నెలల క్రితం వివాహమైంది. గురువారం సాయంత్రం ఇంట్లో  దుస్తులు ఆరవేస్తూ విద్యుత్‌తీగను తాకడంతో విద్యుదాఘాతానికి గురై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై మత్తిగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

ఏడాదిన్నర క్రితమే పెళ్లి..
క్రిష్ణగిరి: క్రిష్ణగిరి పాతపేటకు చెందిన  సూర్య(24) అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి ఏడాదిన్నర క్రితం పెళ్లి జరిగింది. దంపతుల మధ్య తరచూ  గొడవలు జరుగుతున్నాయి.  దీంతో జీవితంపై విరక్తి చెందిన సూర్య.. గురువారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.  

వృద్ధుడి మృతదేహం స్వాధీనం
క్రిష్ణగిరి: కే.ఆర్‌.పీ డ్యాం సమీపంలోని కొత్తపల్లి అటవీ ప్రాంతంలో పడి ఉన్న గుర్తు తెలియని వృద్ధుని మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకొని క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వృద్ధుడు ఏ ప్రాంతవాసి అనేది తెలియలేదని, వివరాలు తెలిసిన వారు తమ సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. 

చదవండి: కరెంట్‌షాక్‌కు గురైన వారికి ప్రథమ చికిత్స ఇలా...

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top