సీఐ అవమానించాడని ఆత్మహత్యాయత్నం

Men Commit Suicide Infront Of Police Station In  - Sakshi

సాక్షి, దుబ్బాక (మెదక్‌): ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన తనను సీఐ అవమానపరిచాడంటూ బాధితుడు ఆరోపించాడు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని నర్లెంగడ్డకు చెందిన వార్డు మెంబర్‌ ఎమ్మ యాదగిరి శనివారం తన భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో సీఐ హరికృష్ణ తనను కొట్టి, బూతులు తిడుతూ అవమానించాడని, న్యాయం చేయాలని కోరుతూ బంధువులతో కలిసి పెట్రోల్‌ బాటిల్‌తో స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ స్పందించి యాదగిరి చేతిలోనుంచి పెట్రోల్‌ బాటిల్‌ లాక్కున్నాడు. ఈ ఘటనతో పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ చల్లా దేవారెడ్డి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని బాధితులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.  

వివరాలు వెల్లడించిన ఏసీపీ 
కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ చల్లా దేవారెడ్డి విలేకర్లకు వివరించారు. శుక్రవారం రాత్రి నర్లెంగ్డ గ్రామంలో నిర్వహించిన వినాయక నిమజ్జనం వేడుకల్లో గ్రామానికి చెందిన ఎమ్మ యాదగిరి, ఎమ్మ లింగం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

యాదగిరి కుటుంబసభ్యులపై లింగం వర్గీయులు అసభ్యంగా ప్రవర్తించడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలకు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. కాగా ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.   

చదవండి: నిఖా అయిన నిమిషానికే ప్రియుడితో పెళ్లికూతురు పరార్‌!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top