నాన్నా.. నేనేం పాపం చేశాను! | Sakshi
Sakshi News home page

నాన్నా.. నేనేం పాపం చేశాను!

Published Fri, Jan 5 2024 3:49 AM

Man tried to commit suicide by drinking insecticide - Sakshi

అయిజ: భార్యపై అనుమానంతో రెండేళ్ల కుమా రుడిని పొట్టనపెట్టుకున్నాడో ప్రబుద్ధుడు. వివరా లిలా.. అయిజ పట్టణంలో నివాసముంటున్న భార్గవకు నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లికి చెందిన శ్రావణితో 2019లో వివాహమైంది.   వీరికి కుమార్తె నయనిక, కుమారుడు నందకిశోర్‌(2) ఉన్నారు. కొంతకాలంగా భార్యను అనుమా నిస్తూ భార్గవ తరుచూ గొడవ పడుతున్నాడు. వేధింపులు ఎక్కువ కావడంతో పదిరోజుల క్రితం కుమార్తె, కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లేందుకు శ్రావణి ప్రయత్నించగా.. అడ్డు కున్న భార్గవ.. కుమారుడు నందకిషోర్‌ను లాక్కున్నాడు. దీంతో ఆమె కూతురు నయనికను తీసుకొని వెళ్లిపోయింది.

నందకిషోర్‌ ప్రతిరోజూ అమ్మ కావాలని ఏడుస్తుండడంతో.. భరించలేక పసివాడికి నిద్రమాత్రలు వేసి పడుకోబెట్టాడు. పదిరోజులుగా భార్య లేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన భార్గవ వారం క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన అతని తల్లి వడ్లకుమారి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. దీంతో కోలుకున్నాడు.

అయితే బుధవారం అర్ధరాత్రి తర్వాత మరోసారి భార్గవ రెండేళ్ల తన కుమా రుడు నందకిషోర్‌కు ఎలుకల మందు తాగించి, తానూ తాగాడు. గురువారం ఉదయం తల్లి కుమారి నిద్ర లేచేసరికే కొడుకు, మనవడు అపస్మారక స్థితిలో ఉండడం గమనించి.. స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం భార్గవ గద్వాల జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నా.. పరిస్థితి విషమంగానే ఉందని అంటున్నారు. శాంతినగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement