వాహనదారుడి దాష్టికం! కారుతో కానిస్టేబుల్‌ కాలుని తొక్కించి... | Sakshi
Sakshi News home page

వాహనదారుడి దాష్టికం! కారుతో కానిస్టేబుల్‌ కాలుని తొక్కించి...

Published Wed, Jan 11 2023 7:57 AM

Man Ran Over Traffic Constables Leg With Car Assaulted At Banjara Hills - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: ఫ్రీ లెఫ్ట్‌లో కారును అడ్డు తొలగించాలని కోరిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై వాహనదారుడు కారుతో కాలును తొక్కించడమే కాకుండా దాడి చేసిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.1లోని తాజ్‌కృష్ణా జంక్షన్‌లో ఓ కారు డ్రైవర్‌ ఫ్రీ లెఫ్ట్‌లో కారు నిలపడంతో అక్కడ విధుల్లో ఉన్న బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఎల్‌.నగేష్‌ అడ్డు తొలగాలని సైగలు చేశాడు.

అయినాసరే సదరు వాహనదారుడు వినిపించుకోలేదు. వెంటనే కానిస్టేబుల్‌ ఆ కారు దగ్గరికి వెళ్ళగా ఆగ్రహంతో ఊగిపోతున్న డ్రైవర్‌ కోపంతో కానిస్టేబుల్‌ కాలుపైకి కారును పోనిచ్చాడు. అంతే కాకుండా కిందకు దిగి పిడిగుద్దులతో దాడి చేసి చెప్పుతో కొట్టాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ బట్టలు కూడా చిరిగాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిపై సెక్షన్‌ 353 కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement