పైశాచికత్వం: భార్యను చంపి.. ఆవు పేడతో.. | Man Killed His Wife And Covered Her Body With Cow Dung | Sakshi
Sakshi News home page

పైశాచికత్వం: భార్యను చంపి.. ఆవు పేడతో..

Aug 31 2020 4:47 PM | Updated on Aug 31 2020 5:26 PM

Man Killed His Wife And Covered Her Body With Cow Dung - Sakshi

కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ పైశాచిక భర్త. భార్యను అతి కిరాతకంగా చంపడమే కాకుండా మాంత్రికుని సహాయంతో మృతదేహాన్ని ఆవు పేడతో కప్పి తిరిగి బతికించుకునేందుకు సాహసించాడు ఆ ప్రబుద్దుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. బేతుల్‌ జిల్లాలోని చిచోలి గ్రామంలో భైయలాల్‌(46), ఆయన భార్య నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. భైయలాల్‌ మద్యానికి బానిస అవ్వడంతో గత కొంత కాలంగా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు సంభవిస్తుండేవి. దీంతో అతని ముగ్గురు పిల్లలు వేరే చోట నివసిస్తున్నారు. (‘చిత్ర హింసలు పెట్టి.. కొట్టి చంపేశారు’)

ఈ క్రమంలో ఆగష్టు 26న తాగి వచ్చిన భైయలాల్‌ తన భార్యతో వాదనకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవడంతో చెక్క కర్రతో ఆమె తలపై గట్టిగా బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అయితే చనిపోయిన తన భార్యను మళ్లీ బతికించుకోవచ్చని ఓ మాంత్రికుడు చెప్పడంతో అతని సలహా మేరకు ఆమె శరీరాన్ని ఆవు పేడతో కప్పి రెండు రోజులపాటు అలాగే ఉంచాడు. ఈ లోపు నిందితుడి ఇంటికి మాంత్రికుడు చేరుకోకముందే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆగష్టు 28న పాక్షికంగా కృళ్లిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిచోలీ పోలీస్‌ స్టేషన్‌లో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మాంత్రికుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చిచోలి పీఎస్‌ ఇంచార్జి దీపక్‌ పరాషర్‌ తెలిపారు. (139 మంది అత్యాచారం కేసులో ట్విస్టు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement