యూకేలో ఉద్యోగమంటూ.. మాయ మాటలతో బుట్టలో వేసుకొని

Man Cheated Hyderabadi And Dump 11 Lakhs With Promise Of Uk JOb - Sakshi

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ పేరుతో  సైబర్‌ నేరగాళ్ల మోసం

సాక్షి, హిమాయత్‌నగర్‌: యూకేలో ఉద్యగమంటూ నమ్మించారు.. డాక్యుమెంట్లకు డబ్బులన్నారు. అలా ఆశ పెట్టి నగర వాసి నుంచి ఉన్నవన్నీ ఊడ్చేశారు సైబర్‌ నేరగాళ్లు. నగర వాసి ఉద్యోగం కోసం తన రెజ్యూమ్‌ని ఆన్‌లైన్‌ పెట్టాడు. రెజ్యూమ్‌ చూసిన సైబర్‌ నేరగాడు నగర వాసితో మాటలు కలిపాడు. యూకేలో అయితే మంచి హోదా, ప్యాకేజీతో మీ చదువుకు తగిన ఉద్యోగం వస్తుందన్నాడు. అతను చెప్పిన మాయ మాటలకు బుట్టలో పడ్డాడు. డాక్యుమెంట్స్‌ కోసమని, వీసా కోసమని డబ్బులు కావాలన్నాడు.

ఆ తర్వాత తాము చెన్నై ఆర్‌బీఐ నుంచి మాట్లాడుతున్నామని మరికొన్ని డాక్యుమెంట్స్‌ అవసమరమన్నారు. ఇలా డాక్యుమెంట్స్‌ పేరు చెప్పి నగర వాసికి ఆశ చూపి పలు దఫాలుగా రూ.11లక్షల 14వేలు కాజేశారు. మరో వ్యక్తి ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌ కోసం ప్రయత్నించగా..తాము సాయ పడతామని చెప్పారు. మొబైల్లో ఎనీడెస్క్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయించి నగర వాసి అకౌంట్‌లో నుంచి రూ.2లక్షల 56వేలు స్వాహా చేశారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్‌ తెలిపారు. 
చదవండి: సాయితో సోనీ వివాహేతర సంబంధం.. చంపుతానని భర్త బెదిరించడంతో..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top