Karnataka Man Killed His Friends Over Harassing His Wife, Goes Viral - Sakshi
Sakshi News home page

Man Killed His Friends: భార్యను వేధించారని.. ఇద్దరి హత్య

Dec 13 2021 7:58 AM | Updated on Dec 15 2021 3:08 PM

Man Brutally Killed His Friends In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మైసూరు(కర్ణాటక): నగరంలోని బోగాది రోడ్డులో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. రవి (28), బసవ (30) అనే ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. నిందితుడు మహేష్, అతనికి సహకరించిన మరొకరిని సరస్వతిపురం పోలిసులు అరెస్టు చేశారు. వీరందరూ కలిసి మద్యం తాగారు. ఆ మత్తులో మహేష్‌ భార్య అటు వైపు రాగా, మృతులు ఇద్దరూ ఆమెను వేధించారు. గతంలో కూడా కొన్నిసార్లు ఇలాగే జరిగింది.

ఈసారి తీవ్ర ఆగ్రహానికి లోనైన మహేష్, అతని స్నేహితునితో కలిసి రవి, బసవను కత్తులతో నరికి హత్య చేశాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. మృతులు హెచ్‌డీ కోటె కొత్తగాల గ్రామానికి చెందినవారని, అందరూ చిన్న చిన్న పనులు చేసుకునేవారని తెలిసింది.   

చదవండి: సైబర్‌ మోసాలకు గురయ్యారా? అయితే ఈ నంబర్‌ మీకోసమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement