మహిళతో వివాహేతర సంబంధం.. సెల్‌ఫోన్‌ చార్జర్‌ వైర్‌తో ఆమె పిల్లలపై..

Man Attacked Cell Phone Charger Wire On Children In Vijayawada - Sakshi

ఆటోనగర్‌ (విజయవాడతూర్పు): మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమె పిల్లలపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో చిన్నారులు సుధాకర్‌ (11), యేసు (5) గాయాలపాలయ్యారు. పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదాల దైవకృప జ్యోతి (శ్రావణి) వెంకన్నకు 13 సంవత్సరాల క్రితం వివాహమైంది.

వీరు కృష్ణా జిల్లా కెంపల్లి కొత్తగూడెంలో ఉండేవారు. వీరిద్దరూ రెండేళ్ల క్రితం విడిపోయారు. శ్రావణి ప్రస్తుతం భారతినగర్‌లో నివాసముంటూ నగరంలోని ప్రముఖ హోటల్లో పని చేస్తుంది. అక్కడే పని చేస్తున్న రఘువర్మతో పరిచయం ఏర్పడటంతో ఆరు మాసాలుగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తుంది. సరిగా చదవడం లేదనే సాకుతో రఘువర్మ సుధాకర్, యేసును సెల్‌ఫోన్‌ చార్జర్‌ వైర్‌తో కొట్టడంతో పిల్లల వీపులపై వాతలు వచ్చాయి. దీంతో శ్రావణి పటమట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పిల్లలను చైల్డ్‌లైన్‌కు తరలించారు. రఘువర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఘట్‌కేసర్‌: కాలేజీ వాట్సాప్‌ గ్రూపుల్లో బీటెక్‌ స్టూడెంట్స్‌ ఫేక్‌ న్యూడ్‌ ఫొటోలు..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top