ముగ్గుర్ని చంపి, శవాలతో శృంగారం | Man Assasinated Wife And Sister In Law And Mother In Law | Sakshi
Sakshi News home page

ముగ్గుర్ని చంపి, శవాలతో శృంగారం

Sep 26 2020 7:09 PM | Updated on Sep 26 2020 7:26 PM

Man Assasinated Wife And Sister In Law And Mother In Law - Sakshi

పానిపట్‌ : భార్య, అత్త, మరదల్ని దారుణంగా హత్య చేసిన ఓ కిరాతకుడు అంతటితో ఆగకుండా వారి శవాలతో శృంగారం జరిపాడు. ఈ ఒళ్లు గగుర్పొడిచే సంఘటన హర్యానాలోని పానిపట్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోనెపత్‌ జిల్లా, పట్టి కలియానా గ్రామానికి చెందిన నూర్‌ హాసన్‌ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందని.. అత్త, మరదలు అందుకు సహాయం చేస్తున్నారని భావించాడు. దీంతో వారిపై కక్ష పెంచుకుని హత్యకు పథకం రచించాడు. కొద్దిరోజుల క్రితం భార్య, మరదలికి మత్తు మందు ఇచ్చి కత్తితో నరికి చంపేశాడు. అనంతరం వారి శవాలతో శృంగారం చేశాడు. ఆ వెంటనే మృతదేహాలను దుప్పట్లో చుట్టి దూరంగా పడేశాడు. ( ప్రియురాలి కుటుంబంపై కోపంతో.. )

మూడు రోజుల తర్వాత అత్తగారి ఊరికి వెళ్లి ఆమెను అక్కడినుంచి తీసుకొచ్చాడు. అనంతరం అత్తను కూడా చంపి, ఆమె శవంతో కూడా శృంగారం చేశాడు. ఆ తర్వాత శవాన్ని మంటల్లో తగలబెట్టాడు. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత ఆ ముగ్గురి శవాలు మూడు వేరువేరు ప్రదేశాలలో వారికి లభించాయి. హాసన్‌పై అనుమానంతో అతడ్ని ప్రశ్నించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. దీంతో గురువారం పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement