Hyderabad: అమ్మాయిలా నటిస్తూ.. రొమాంటిక్‌గా వారితో చాటింగ్‌ | Man Arrest For Create Fake Insta Id Chat With Women And Blackmailing | Sakshi
Sakshi News home page

Hyderabad: అమ్మాయిలా నటిస్తూ.. రొమాంటిక్‌గా వారితో చాటింగ్‌

Aug 20 2022 3:40 PM | Updated on Aug 20 2022 5:49 PM

Man Arrest For Create Fake Insta Id Chat With Women And Blackmailing  - Sakshi

నిందితుడు సాయకృష్ణారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి,  అమ్మాయిలా నటిస్తూ.. రొమాంటిక్‌గా వారితో చాట్‌ చేస్తూ... నగ్నంగా వీడియో కాల్‌ మాట్లాడించి బ్లాక్‌ మొయిల్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేస్తున్న ఓ కేటుగాడిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌ కాలనీలో నివాసం ఉండే కూచికుల సాయకృష్ణారెడ్డి (31) నగరంలో ఈవెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.

ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా అమ్మాయి పేరుతో ఇతరులను పరిచయం చేసుకుని ఫ్యాషన్‌ డిజైనర్‌గా పని చేస్తున్నానని పేర్కొని ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ చేశాడు. దీంతో నగరానికి చెందిన ఓ యువకుడు చాట్‌ చేయగా,  అతడితో అతను నగ్న వీడియో కాల్‌ చేయడానికి ప్రేరేపించాడు. అనంతరం సెల్‌ఫోన్‌ స్కీన్‌ రికార్డ్‌ చేసి దాని వీడియో క్లిప్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. తన అకౌంట్‌కు డబ్బు ట్రాన్స్‌ఫర్‌  చేయాలని డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా,  పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌ తరలించారు. 
చదవండి: ఐదేళ్లు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామని యువతిని అడిగితే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement