నరసింహ రెడ్డి కేసులో మరో 8 మంది అరెస్ట్

సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మల్కాజ్ గిరి ఏసీపీ నరసింహ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం అధికారులు ఈ కేసుకు సంబంధించి మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరంతా పలు సందార్భాల్లో నరసింహ రెడ్డికి సాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. మాదాపూర్లోని రెండు వేల గజాల స్థలం వివాదంలో నరసింహ రెడ్డి జోక్యం చేసుకోవడమే కాక బినామీల పేర్లతో మాదాపూర్ భూమిని దక్కించుకున్నాడు. మార్కెట్ విలువ ప్రకారం ఆ ల్యాండ్ దాదాపుగా 50 కోట్ల విలువ చేస్తుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఎనిమిది మంది కలిసి తప్పుడు పత్రాలతో భూమిని స్వాధీనం చేసుకున్నట్లుగా నిర్ధారణయ్యింది. దాంతో అధికారులు నరసింహ రెడ్డికి సాయం చేసిన ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. (చదవండి: ఏసీపీ నరసింహారెడ్డి రెండో లాకర్ ఖాళీ)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి