దారుణం: వేశ్యను వాడుకుని డ్రైనేజీలో పారవేత

Maharashtra: Woman Sexual Assault In Mumbai - Sakshi

ముంబై: మహిళపై అత్యారానికి పాల్పడి అనంతరం దారుణంగా హత్య చేశారు. అంతటితో వదలకుండా ఆమె మృతదేహాన్ని ఏకంగా భూగర్భ డ్రైనేజీ సమీపంలో పారవేసిన సంఘటన మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో సంపన్నులు నివసించే బాంద్రాలో ఈ ఘటన చోటుచేసుకుంది. చౌరస్తా మధ్యలో ఉన్న డ్రైనేజీ వద్ద కొందరు మహిళ శవాన్ని గుర్తించారు. 

ముంబైలోని ఎంటీఎన్‌ఎల్‌ జంక‌్షన్‌ సమీపంలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ వద్ద ఉన్న డ్రైనేజీ వద్ద స్థానికులు ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించగా మహిళ అత్యాచారంతో పాటు హత్యకు గురయ్యిందంటూ వైద్యులు నిర్ధారించారు. జననాంగాల వద్ద తీవ్రంగా గాయాలైనట్టు వైద్యులు తమ నివేదికలో తెలిపారు. 

ఈ ఘటనపై పోలీసులు సెక‌్షన్‌ 376 (అత్యాచారం), 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. హత్యకు గురయిన ఆమె వేశ్య అని తెలిసింది. నగదు సంబంధించిన విషయంలో గొడవ జరిగి హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. ఆమెను పిలిపించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలుస్తోంది. అయితే ఇది క్షణికావేశంలో చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.

చదవండి: మృగాళ్లకు బాలిక బలి: నిందితుల్లో మైనర్లు
చదవండి: కరోనా భయంతో వర్ధమాన గాయని ఆత్మహత్య

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top