Madhya Pradesh: ఉసురు తీసిన ఇద్దరితో వివాహేతర సంబంధం.. ద్రోహం చెయ్యొద్దంటూ..

Madhya Pradesh Man Allegedly Killed Woman Posted Social Media - Sakshi

షాక్‌కి గురిచేసిన ఢిల్లీలోని ప్రియురాలి హత్యోదంతం మరువక మునుపే ఇదే తరహాలో మధ్యప్రదేశ్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. ఇద్దరితో సాగించిన వివాహేతర బంధం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

వివరాల్లోకెళ్తే...పాట్నాకు చెందిన వ్యాపారి అభిజిత్‌ ఒక మహిళను చంపి వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం పెద్ద కలకలం రేపింది. అతను మంచంపై ఉన్న పడి ఉన్న స్తీని దుప్పటి కప్పి గొంతు కోసి చంపుతూ...' ద్రోహం చెయ్యద్దు' అని వీడియోలో ఉన్నాదిలా అరుస్తున్నట్లు కనిపించింది. తన పేరు అభిజిత్‌ అని తన వ్యాపార భాగస్వామి జితేంద్ర కూమర్‌ అని వీడియోలో పేర్కొన్నాడు.

ఆ బాధితురాలు తమ ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఆమెను చంపమని జితేంద్రనే చెప్పినట్లు నిందితుడు వీడియోలో తెలిపాడు. బాధితురాలు తన భాగస్వామి నుంచి సుమారు రూ. 12 లక్షలు అప్పుగా తీసుకుని పారిపోయినట్లు.. ఆమెను జితేంద్ర ఆదేశాల మేరకే హత్య చేసినట్లు చెప్పాడు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జితేంద్ర, అతని సహాయకుడు సుమిత్‌ పటేల్‌ని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో అభిజిత్‌ జితేంద్ర ఇంట్లోనే నెలరోజులుగా ఉన్నట్లు సీసీఫుటేజ్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న అభిజిత్‌ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి తీవ్రం గాలిస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ శివేష్ బఘేల్ చెప్పారు. 

(చదవండి: భర్త తిరిగి వచ్చేసరికే షాక్‌...భార్య, పిల్లలు..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top