భర్త మృతి.. ఆ తర్వాత భార్య ఏం చేసిందంటే..?

Karnataka Woman Kills Son And Commits Suicide - Sakshi

సాక్షి, బెంగళూరు: భర్త మరణ వార్తను ఆమె తట్టుకోలేకపోయింది. కట్టుకున్న భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. మరణ వార్త తెలిసిన కొన్ని గంటల్లోనే తన ఆరు నెలల కుమారుడిని చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కర్నాటకలోని రాయ్‌చూర్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. మంగళూరులోని అగ్నిమాపక దళంలో గంగాధర్ డ్రైవర్​గా ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, గంగాధర్​ (36), శ్రుతి(30) భార్యాభర్తలు.. వీరికి ఆరు నెలల కుమారుడు అభిరామ్​ ఉన్నాడు. గంగాధర్‌ కుటుంబం రాయ్‌చూర్‌లో నివాసం ఉంటోంది. ఇదిలా ఉండగా, శనివారం రాత్రి.. గంగాధర్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుంటికాన సమీపంలో నేషనల్‌ హైవే-66పై గంగాధర్​ దాటుతుండగా వేగంగా వెళ్తున్న ఓ కారు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

అయితే, రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోయాడన్న వార్త శ్రుతికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిన భార్య.. భర్తలేని జీవితాన్ని ఊహించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం అర్దరాత్రి సమయంలో తన ఆరు నెలల చిన్నారి అభిరామ్​ను హత్యచేసి, తాను సూసైడ్‌ చేసుకుంది. ఒక్క మరణంతో ఆ కుటుంబంలో ఊహించని పరిస్థితులు నెలకొనడంతో ఫ్యామిలీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్టు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top