Raj Kundra Case: Sachin Joshi Win The Case Against Raj Kundra - Sakshi
Sakshi News home page

Raj Kundra: ఎప్పటికైనా ఖర‍్మ అనుభవించాల్సిందే!

Published Fri, Jul 23 2021 2:36 PM

Karma caught up with him:Sachiin Joshi wins case against Raj Kundra Shilpa Shetty - Sakshi

సాక్షి, ముంబై: నీలిచిత్రాల కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ నటి, శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రాకు మరో భారీ షాక్‌ తగిలింది. శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రాపై న్యాయ పోరాటంలో నటుడు, నిర్మాత సచిన్ జోషి విజయం సాధించారు. ఎస్జీపీఎల్ సత్యయుగ్ గోల్డ్ స్కీమ్ వివాదంలో జోషికి సంబంధించిన బంగారాన్ని ఆయనకు అప్పగించాలని, అలాగే చట్టపరమైన చర్యలకు గాను మరో 3 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి, సత్యగ్ గోల్డ్ బంగారు పథకంలో తనను మోసం చేశారని ఆరోపించిన సచిన్ జోషి ఈ ఏడాది జనవరిలో వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా కోర్టు జోషికి అనుకూలంగా తీర్పునిచ్చింది. జోషికి కిలో బంగారాన్ని అప్పగించడంతోపాటు, కోర్టు ఖర్చుల కింద మూడు లక్షలు రూపాయలు  చెల్లించాలని బొంబాయి హైకోర్టు ఆదేశించింది.  శిల్పా, రాజ్, ‘సత్యయుగ్  గోల్డ్’ కంపెనీలో  అప్పటికి డైరెక్టర్లుగా ఉన్నారు. తక్కువ రేటుకే బంగారం స్కీం పేరుతో పలువురి వద్ద డబ్బులు సేకరించారు. ఇది తమకు చెల్లించలేదని ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే  జోషి కేసులో తాజా తీర్పు వెలువడింది.

ఈ తీర్పుపై స్పందించిన సచిన్‌ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్లు తను కష్టపడి దాచుకున్న డబ్బును అక్రమంగా కాజేయాలని చూశారు. 18లక్షలు విలువ చేసే బంగారం తిరిగి ఇవ్వటానికి కుంద్రా సంస్థ 25 లక్షలు డిమాండ్‌ చేసిందని మండిపడ్డారు. తనబంగారాన్ని తనకివ్వమని అడిగితే, రివర్స్‌లో  తనపైనే బురద చల్లారంటూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చివరికి న్యాయమే గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. చేసిన పాపాలు ఎక్కడిపోతాయి...కర్మ అనుభవించక తప్పదంటూ వ్యాఖ్యానించారు. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా బాధితులు ఇంకా చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. అంతకుముందు పోర్న్ వీడియో  స్కాంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన వెంటనే సచిన్ జోషి భార్య, నటి ఊర్వశి శర్మ తన ఇన్‌స్టా స్టోరీలో..‘చేసిన పాపంవెంటాడుతుంది’ అంటూ ఒక పోస్ట్‌ పెట్టడం విశేషం.  మరోవైపు సోమవారం అర్థరాత్రి అరెస్ట్‌ చేసినరాజ్‌కుంద్రా రిమాండ్‌ను మరో మూడు రోజుల పాటు పొడిగించారు. రాజ్‌ అరెస్ట్‌ అక్రమమని బెయిల్‌ మంజూరుచేయాలన్న పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అనంతరం జూలై 27వరకు పోలీసు కస్టడీ విధించింది.

Advertisement
Advertisement