3 గజాల స్థల వివాదం.. ఓ నిండు ప్రాణం బలి

Karimnagar: Man Deceased 3 Yards Place Dispute Jagtial - Sakshi

సాక్షి, కరీంనగర్‌(జగిత్యాల): జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. మూడు గజాల స్థల వివాదం ఒకరి ప్రాణాలను బలిగొంది. జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లిలో జాలపల్లి రవి, పత్తిపాక బాపన్నకు మధ్య ఇంటి  దారి విషయంలో భూ వివాదం నెలకొంది.

మూడు గజాల స్థలం కోసం పలుమార్లు వారు గొడవ పడ్డారు. గొడవ మరింత ముదరడంతో ఈరోజు బాపన్న.. రవి, ఆయన భార్య మల్లవ్వపై  కర్రతో దాడికి పాల్పడ్డాడు. రవి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గాయపడ్డ మల్లవ్వను స్థానికులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

చదవండి: దారుణం: కన్నతల్లిని చూడకుండానే కవలల మృతి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top