మారణాయుధాలతో తిరుగుతున్న ఇద్దరికి జైలు 

Jail Sentence For Two People Traveling With Deadly Weapons - Sakshi

సాక్షి, చిలకలగూడ: మారణాయుధాలతో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష విధించిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ నరేష్, డీఐ నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.   సికింద్రాబాద్‌ మెట్రోస్టేషన్‌ ఫుట్‌పాత్‌పై నివసిస్తున్న జంజర్ల ప్రేమ్, లోయర్‌ట్యాంక్‌బండ్‌ గోశాల ప్రాంతానికి చెందిన కైత నాగరాజు చిత్తుకాగితాలు, ప్లాస్టిక్‌ బ్యాటిల్స్‌ ఏరుకుని జీవనం సాగించేవారు.

ఈనెల 21న రాత్రి గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని గస్తీ పోలీసులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. అదుపులోకి తీసుకుని సోదా చేయగా వారి వద్ద కత్తి, చాకు లభించాయి. ఈ పెట్టీ కేసులు నమోదు చేసి గురువారం సికింద్రాబాద్‌ 15వ స్పెషల్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో హాజరుపర్చగా, ఐదు రోజుల చొప్పున జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.   

(చదవండి: దారి కాచి...దాడి చేసి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top