Hyderabad: Father Found Suspicious Reasons Behind His Daughter Death, Suspects Her Husband Family - Sakshi
Sakshi News home page

Hyderabad Crime: అనుమానాలున్నాయి.. బాత్రూమ్‌లో పడింది, మంచం తగిలింది, ఉరేసుకుందని..

May 21 2022 7:53 AM | Updated on May 21 2022 9:40 AM

Hyderabad: Father Suspicion On Daughter Death - Sakshi

గ్లోరీ(ఫైల్‌)  

సాక్షి, హైదరాబాద్‌: తన కూతురు గ్లోరీ(23) మృతిపై అనుమానాలున్నాయని తండ్రి విజయ భాస్కర్‌ ఆరోపించారు. కొండాపూర్‌లోని శ్రీరాంనగర్‌ ఏ బ్లాక్‌లో అత్తవారింట్లో ఈ నెల 12న తన కూతురు అనుమానాస్పదంగా మృతి చెందిందని, ఒంటిపై గాయాలు ఉన్నాయన్నారు. బాత్రూమ్‌లో పడిపోయిందని.. బెడ్రూమ్‌లో మంచం తగిలిందని, ఫ్యాన్‌కు ఉరి వేసుకుందని పలు విధాలుగా చెప్పారని పేర్కొన్నారు. తన కూతురును వేధింపులకు గురిచేస్తే సర్దిచెప్పి పంపించామన్నారు. భర్త, అత్త మామ, ఆడపడుచులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ సురేష్‌ తెలిపారు.

విద్యార్థిని అదృశ్యం 
గచ్చిబౌలి: ప్రాజెక్ట్‌ వర్క్‌ కోసమని వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చింతకాయల వెంకటేష్‌ వివరాల ప్రకారం.. రాయదుర్గంలోని మధురానగర్‌లో నివాసముండే మాధవి (19) గచ్చిబౌలిలోని రోడిమిస్త్రీ కాలేజీలో బీఎస్‌డబ్ల్యూ కోర్సు చేస్తోంది. ఈ నెల 19న ముషీరాబాద్‌లో ప్రాజెక్ట్‌ ఉందని చెప్పి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో తల్లి నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement