వ్యభిచార గృహంపై  దాడి.. ఇద్దరు విటుల అరెస్టు 

HYD: Police Raids On Brothel House In Golconda - Sakshi

సాక్షి,  గోల్కొండ: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గెస్ట్‌ హౌస్‌పై గోల్కొండ పోలీసులు దాడి చేశారు. గెస్ట్‌హౌస్‌ వాచ్‌మెన్‌తో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేశారు. గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్‌ అలియాస్‌ మున్నాభాయ్‌ షేక్‌పేట్‌ ఓయూ కాలనీలో ‘ఎంఎస్‌పీ గెస్ట్‌ ఇన్‌’గెస్ట్‌ హౌజ్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. గెస్ట్‌హౌజ్‌ను బాగా ఇంటీరియర్‌ డెకరేషన్‌ చేసి ఇంటి ముందు ఒక సెక్యూరిటీ గార్డును కూడా నియమించుకున్నాడు. కాగా ఇతర ప్రాంతాల నుంచి యువతులను తెచ్చి వ్యభిచారం నిర్వహించేవాడు.

అయితే బుధవారం రాత్రి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో ఇద్దరు యువతులు, ఇద్దరు విటులతో పాటు గెస్ట్‌హౌజ్‌ వాచ్‌మెన్‌ జనైనాజెమ్‌ ఉద్దీన్‌ మలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు మున్నాభాయ్‌ పరారీలో ఉన్నాడు. వాచ్‌మెన్‌తో పాటు పట్టుబడ్డ వి.శ్రీను, గొలుసుల శ్రీనివాస్‌లను రిమాండ్‌కు తరలించారు. పోలీసులు వారి నుంచి రూ.4వేల నగదు, 5 మొబైల్‌ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నాడు.  

వ్యభిచార ముఠా సభ్యులపై పీడీయాక్ట్‌
చైతన్యపురి: సులువుగా డబ్బు సంపాదన కోసం వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యులపై సరూర్‌ నగర్‌ పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. బత్తుల మానస, వల్లపు మల్లికార్జున్, పోకల లింగయ్యలు ఒక ముఠాగా ఏర్పడి తెలుగు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచార గృహం నడుపుతున్నారు. సమాచారం అందుకున్న సరూర్‌నగర్‌ పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసులు వారం రోజుల క్రితం ఇంటిపై దాడి చేశారు. మానస, మల్లికాఖార్జులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న పోకల లింగయ్యను గురువారం అరెస్టు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.  

చదవండి: హైటెక్‌ సిటీ: విదేశీ యువతులతో వ్యభిచారం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top