గూగుల్‌ సెర్చ్‌ చేసి నిండా మునిగిన బీటెక్‌ బాబులు..

HYD: Man Cheats B Tech Student In The Name Jobs Over RS 27 Lakhs - Sakshi

ఉద్యోగం ఇస్తానంటూ 40 మందికి ఎర

రూ.27.30 లక్షలకు టోకరా  

సాక్షి, హిమాయత్‌నగర్‌: వారంతా బీటెక్‌ పూర్తి చేశారు.. పేరుగాంచిన కంపెనీలో ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. గూగూల్‌ ఉంది కదా అని సెర్చ్‌ చేసి ఓ నంబర్‌ను సాధించారు. అతగాడికి ఫోన్‌ కలపగా..మాదాపూర్‌లో కొత్తగా ‘లిమిటెక్స్‌’ పేరుతో పెద్ద కంపెనీ పెట్టా. నేనే సీఈఓ. నేనే ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకుంటున్నా. ఆసక్తి ఉంటే రెజ్యూమ్‌లు పంపండి అని నమ్మబలికాడు. నిజమే కదా అని నమ్మిన సుమారు 35–40 మంది తమ రెజ్యూమ్‌లు పంపి మళ్లీ అతడిని ఫోన్‌లో కాంటాక్ట్‌ చేశారు. ఉద్యోగం రావాలంటే ముందుగా కొంత డబ్బు చెల్లించాలనడంతో..ఏ మాత్రం ఆలస్యంగా చేయకుండా ఒక్కొక్కరు పోస్టుకు తగ్గట్టు రూ.లక్ష, రూ.3లక్షల చొప్పున సుమారు రూ.27లక్షల 30 వేలు ఆన్‌లైన్‌ ద్వారా పంపారు.

ఆ తర్వాత నుంచి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో మోసపోయానని అల్వాల్‌కు చెందిన బుచ్చిరాములు సోమవారం సైబర్‌క్రైం పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. తనలాగా ఎవరైనా బాధితులు ఉన్నారా అని గూగూల్లో సర్చ్‌ చేయగా..35– 40మంది బాధితులు ప్రస్తుతానికి బుచ్చిబాబును కాంటాక్ట్‌ చేశారు. దీంతో వీరంతా మంగళవారం నేరుగా సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. వీరితో పాటు మరింత కొంత మంది ఉండొచ్చనేది బాధితుల నుంచి వస్తున్న సమచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి సైబర్‌క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.   

చదవండి: 
ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం

యువకుడితో ప్రేమ.. పెళ్లి చేసుకుంటానని వెళ్లి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top