హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ అరెస్ట్‌ 

Hindupur MLA Balakrishna PA Balaji Arrested - Sakshi

సాక్షి, హిందూపురం: హైటెక్‌ పద్ధతిలో పేకాట ఆడుతున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బాలాజీని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్ర–కర్ణాటక సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం చిక్‌ బళ్లాపూర్‌ జిల్లా గౌరీబిదనూరు తాలూకా పరిధిలోని నగిరిగెర బీఎన్‌ఆర్‌ రెస్టారెంట్‌ వద్ద జూద కేంద్రంపై కర్ణాటక స్పెషల్‌ టాస్క్‌ఫోర్సు పోలీసులు ఆదివారం దాడి చేశారు. బాలకృష్ణ పీఏ బాలాజీతో పాటు 19 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి  రూ.1,56,750 నగదు, 8 కార్లు, 3 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన వారిలో ఉపాధ్యాయులతో పాటు రాజకీయ నాయకులూ ఉన్నారు. వీరిని సోమవారం గౌరీబిదనూరు పోలీసులు గుడిబండే కోర్టుకు హాజరు హాజరుపర్చగా..రిమాండ్‌కు ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. కాగా.. గతంలో బాలకృష్ణ  పీఏగా పనిచేసిన  శేఖర్‌ కూడా పంచాయతీ రాజ్‌ శాఖలో భారీ అవినీతికి పాల్పడి జైలుకెళ్లాడు. ప్రస్తుత పీఏ బాలాజీ సైతం పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడడంతో బాలకృష్ణ పీఏల తీరు ఇలాగే ఉంటుందా అంటూ హిందూపురం ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు.   

చదవండి: (పవన్‌ కల్యాణ్‌ రాజకీయ బ్రోకర్‌: కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top