గూగుల్‌లో సెర్చ్‌ చేసి దోపిడీకి ప్లాన్‌.. బంగారం అమ్ముతామని రప్పించి దారుణం

Gold Loan Company Employee Murdered in Bengaluru - Sakshi

బనశంకరి (కర్ణాటక): దుండగులు గూగుల్‌ను సెర్చ్‌ చేశారు. గోల్డ్‌ కంపెనీ ఉద్యోగుల వద్ద నగదు  ఉంటుందని గుర్తించి వల వేశారు. బంగారం అమ్ముతామని చెప్పి ఆ కంపెనీ ఉద్యోగిని రప్పించి హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేసి నగదుతో ఉడాయించారు. కాల్‌డేటా ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేశారు.

పుట్టేనహళ్లిపోలీసుల కథనం మేరకు వివరాలు...బనశంకరి సరబండెపాళ్య నివాసి దివాకర్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ గోల్డ్‌ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ప్రజల వద్ద   బంగారు నగలు డిపాజిట్‌ చేయించుకొని రుణాలు ఇచ్చేవారు. ఇదిలా ఉండగా తుమకూరుకు చెందిన మంజునాథ్, మునిరాజ్‌లు దోపిడీ కోసం ప్లాన్‌ వేశారు. గూగుల్‌లో గాలించి ఎస్‌ఎస్‌ఆర్‌ గోల్డ్‌ కంపెనీ కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి దివాకర్‌ నంబర్‌ తీసుకున్నారు. ఈనెల 19న ఫోన్‌ చేశారు.

చదవండి: (కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. హాఫ్‌ హెల్మెట్‌కు బై బై?) 

డబ్బు అవసరం ఉందని, 65.70 గ్రాముల ఆభరణాలు విక్రయిస్తామని చెప్పి సుందనకట్టెకు ఈనెల 20న రప్పించి అతని వద్ద ఉన్న రూ.5లక్షలు లాక్కొని తర్వాత అతన్ని గొంతునులిమి హత్య చేసి శవాన్ని మూటగట్టి అతను వచ్చిన బైక్‌తో సహా మాగడిరోడ్డు హొన్నాపుర చెరువులో పడేశారు. దివాకర్‌ అదృశ్యంపై లక్ష్మీ అనే మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు అతని ఫోన్‌కు వచ్చిన నంబర్లను పరిశీలించి నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేశారు. బుధవారం దివాకర్‌ మృతదేహాన్ని వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు.

చదవండి: (యువ దంపతుల ఆత్మహత్య .. అదే కారణమా..?)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top