రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చారు.. నాలుగు రోజుల్లో పెళ్లి.. కానీ అంతలో.. | Girl Suicide Over Forced Into Marriage Tamilnadu | Sakshi
Sakshi News home page

రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చారు.. నాలుగు రోజుల్లో పెళ్లి.. కానీ అంతలో..

Apr 3 2022 2:58 PM | Updated on Apr 3 2022 5:53 PM

Girl Suicide Over Forced Into Marriage Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై: కోయంబత్తూరు ఆవరపాళయం శక్తి ఎస్టేట్‌కు చెందిన మనోహరన్‌ కుమార్తె కృతిక (28) చెన్నై ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు. చెన్నైలో పరిచమైన ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడింది. ఈ ఇద్దరు కరోనా రూపంలో ఎదురైన వర్క్‌ఫ్రం హోం కారణంగా ఇళ్లకే పరిమితం అయ్యారు. కృతిక కోయంబత్తూరులో, ఆ యువకుడు చెన్నైలో ఉన్నా, రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో కీర్తికకు మరో యువకుడితో  వివాహం చేయడానికి కుటుంబీకులు నిర్ణయించారు. ఈనెల 6న నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. తాజాగా తానో యువకుడ్ని ప్రేమించినట్టు తల్లిదండ్రుల దృష్టికి ఆమె తీసుకెళ్లింది. వారు అంగీకరించక పోవడంతో ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడింది.

మరో ఘటనలో..

ఇద్దరు యువతుల బలవన్మరణం 
సాక్షి, చెన్నై: వేర్వేరు చోట్ల ఇద్దరు యువతులు బలన్మరణానికి పాల్పడ్డారు. వివరాలు.. కోయంబత్తూరులో పీఎన్‌ పుదుర్‌ సమీపంలోని శీరనాయకం పాళయంకు చెందిన పెరుమాల్‌ కుమార్తె శ్వేత (19). ఈమె అన్నూరులోని ఓ అకాడమీ హాస్టల్‌లో బస చేస్తూ నీట్‌ శిక్షణ పొందుతున్నారు. అదే అకాడమీలో శిక్షణకు వచ్చిన మదురైకు చెందిన యువకుడితో పరిచయం ప్రేమగా మారింది. ఇద్దర్నీ పెద్దలు మందలించారు. ఆ యువకుడ్ని మదురైకు తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన శ్వేత శనివారం ఉరి వేసుకుని బలన్మరణానికి పాల్పడింది. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: అమానుషం! బాలికను కొట్టి, అగరబత్తులతో కాల్చి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement