ఓలా డ్రైవర్‌పై రెచ్చిపోయిన గ్యాంగ్.. అరగంట ఆలస్యమైనందుకు దాడి.. రౌడీల్లా రాత్రంతా బంధించి..

సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. క్యాబ్ బుక్ చేస్తే అరగంట ఆలస్యంగా వచ్చినందుకు డ్రైవర్, అతని యజమానిని చితకబాదింది ఓ గ్యాంగ్. ఈ ఘటనలో డ్రైవర్, ఓనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఉప్పర్‌పల్లికి చెందిన వినయ్ రెడ్డి అనే యువకుడు ఓలా క్యాబ్ బుక్ చేశాడు. అరగంట ఆలస్యం కావడంతో డ్రైవర్‌ను నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఓలా డ్రైవర్‌పై వియన్ రెడ్డి అతని స్నేహితులు దాడి చేశారు. డ్రైవర్ ఈ విషయాన్ని తన యజమానికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. వెంటనే ఉప్పర్పల్లికి చేరుకున్న యజమానిని సైతం వియన్ రెడ్డి గ్యాంగ్ చితకబాదింది. రౌడీల్లా రెచ్చిపోయి ఉదయం 4 గంటల వరకు ఓ గదిలో బంధించి కొట్టారు.
చదవండి: ట్రాఫిక్ రద్దీకి చెల్లు.. సైబరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం