నలుగురు బాలికల దారుణ హత్య : తల్లిపై కేసు

 Four minor sisters found murdered in Haryana village mother booked     - Sakshi

 చిన్నారుల గొంతుకోసి హత్య, ఆపై ఆత్మహత్యాయత్నం

తండ్రి ఫిర్యాదు  ఆధారంగా తల్లిపై కేసు నమోదు

చండిగఢ్‌: హరియాణాలో అమానుషం చోటు చేసుకుంది. నలుగురు చిన్నారులను నిర్దాక్షిణ్యంగా హత్య చేసిందో తల్లి. పోలీసుల సమాచారం ప్రకారం నలుగురు మైనర్‌ బాలికలను గొంతుకోసి మరీ దారుణంగా హతమార్చింది. వీరి వయసు ఒకటి నుంచి ఏడు సంవత్సరాల వయస్సు ఉంటుంది. అనంతరం ఆమెకూడా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నుహ్ జిల్లాలోని  పిప్రోలి  గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. బాధిత బాలికల తండ్రి ఫిర్యాదు ఆధారంగా తల్లిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను  ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న తల్లి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  ఇంత దారుణానికి ఆమె ఎందుకు పాల్పడిందో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారి సమర్జీత్  చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top