రైతులకు కుచ్చుటోపి.. రూ.60 కోట్లు ఎగ్గొట్టిన రైస్‌ మిల్లర్‌

Farmers Protest At Rice Mill Owner House In Vijayawada - Sakshi

రైస్‌మిల్లు యజమాని ఇంటి వద్ద రైతుల నిరసన

సాక్షి, విజయవాడ: ఎనికేపాడులో రైతులకు ఓ రైస్‌మిల్లర్‌ రూ.60 కోట్ల మేర కుచ్చుటోపి పెట్టాడు. పల్లవి రైస్‌మిల్లర్ విశ్వనాథం చేతిలో రైతులు మోసపోయారు. విజయవాడలోని రామ మందిరం వద్ద విశ్వనాధం ఇంటికి తెలుగు రాష్ట్రాల్లోని బాధిత రైతులు చేరుకుంటున్నారు. రైతులకు డబ్బులు ఎగ్గొట్టి  విశ్వనాథం తప్పించుకుని తిరుగుతున్నారు.

ఉభయగోదావరి జిల్లాలతో పాటు, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కాకినాడ, కృష్ణాజిల్లా, తెలంగాణ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీగా బాధితులు ఉన్నట్లు సమాచారం. పల్లవి రైస్ మిల్లు వ్యాపారం పేరిట ధాన్యం కొని దాదాపుగా రూ. 60 కోట్లు ఎగవేసినట్లు తెలిసింది. 2015లో 54 మంది బకాయిపడ్డ రైతులు, వ్యాపారులకు 25 కోట్లు చెల్లిస్తానని విశ్వనాధం అగ్రిమెంట్ చేశారు. విశ్వనాథం ఇంటికి తాళం వేసి ఉండటంతో రైతుల ఆందోళన చెందుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top