వివాహేతర సంబంధం: ఏం జరిగిందో కానీ చివరకు.. | Sakshi
Sakshi News home page

Extramarital Affair: వివాహేతర సంబంధం: ఏం జరిగిందో కానీ చివరకు..

Published Mon, Jun 27 2022 9:01 PM

Extramarital Affair: Couple Commits Suicide In Krishna District - Sakshi

గుడ్లవల్లేరు (గుడివాడ)కృష్ణా జిల్లా: మండలంలోని శేరీ కల్వపూడి శివారు విశ్రాంతపురంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివాసం సాయంత్రం జరిగింది. స్థానికులు ఈ సమాచారాన్ని ఆదివారం ఉదయం పోలీసులకు అందించారు. ఎస్‌ఐ వి.ఏసేబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఎస్‌ఐ కథనం మేరకు.. శేరీ కల్వపూడి శివారు విశ్రాంతపురానికి చెందిన వెల్లంకి నాగరాణి(35), అంగలూరుకు చెందిన గుదేపు శివ నాగేంద్రబాబు మధ్య కొన్నేళ్లగా వివాహేతర సంబంధం ఉంది.
చదవండి: మీకు తెలుసా?.. విద్యుత్‌ శాఖ నుంచి మెసేజ్‌లు రావు 

ఆ ఇద్దరూ తరచుగా గొడవలు పడేవారు. ఏడాది క్రితం నాగరాణి తలను నాగేంద్రబాబు గాయపరిచాడు. దీంతో అతనిపై నాగరాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం లోక్‌ అదాలత్‌లో వారిద్దరూ రాజీ పడ్డారు. వారం క్రితం తనను నాగేంద్రబాబు కొడుతున్నాడంటూ నాగరాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏమి జరిగిందో ఏమో శనివారం రాత్రి ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్‌ఐ ఎం.నాగేశ్వరరావు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
 
Advertisement