భార్యతో కలసి హష్‌ ఆయిల్‌ దందా | Drug Racket Busted In hyderabad Police Arrests 11 Including Customers | Sakshi
Sakshi News home page

భార్యతో కలసి హష్‌ ఆయిల్‌ దందా

Apr 7 2022 3:50 AM | Updated on Apr 7 2022 3:50 AM

Drug Racket Busted In hyderabad Police Arrests 11 Including Customers - Sakshi

నిందితుడు మదన్‌

సాక్షి, హైదరాబాద్‌: నాచారం కేంద్రంగా హష్‌ ఆయిల్‌ దందా చేస్తున్న మదన్‌ మానేకర్‌ను హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) అధికారులు పట్టుకున్నారు. దందాలో పాలుపంచుకుంటున్న ఇతడి భార్య కొండపనేని మాన్సీ గతవారమే పోలీసులకు చిక్కింది. మదన్‌తోపాటు అతడి సహాయకుడు ఎన్‌.రాజు, మరో తొమ్మిది మంది కస్టమర్లను హెచ్‌–న్యూ బృందం బుధవారం అరెస్టు చేసింది. పరారీలో ఉన్న మరో తొమ్మిది మంది వినియోగదారుల కోసం గాలిస్తున్నామని డీసీపీ చక్రవర్తి గుమ్మి  చెప్పారు. డీసీపీ వెల్లడించిన వివరాలు..

కొన్నేళ్లుగా మదన్‌ లైటింగ్‌ బోర్డ్‌ వర్కర్‌గా, మాన్సీ ఓ మల్టీ నేషనల్‌ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం వీరిద్దరూ హైదరాబాద్‌లోని చర్లపల్లికి చెందిన స్క్రాప్‌ వ్యాపారి ఎన్‌.రాజుతో జట్టుకట్టి పలువురికి గంజాయి, హష్‌ ఆయిల్‌ విక్రయించేవారు.  
 విశాఖ జిల్లాకు చెందిన బుజ్జి బాబు నుంచి కిలో రూ.60 వేలు చొప్పున మదన్, రాజు హష్‌ ఆయిల్‌ ఖరీదు చేసి సిటీకి తీసుకు వచ్చేవారు. ఐదు గ్రాముల చొప్పున ప్లాస్టిక్‌ కంటైనర్లలో నింపి ఒక్కోదాన్ని రూ.3 వేలకు అమ్మేవారు. 
 హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి, నాచారం, కేపీహెచ్‌బీ, మాదాపూర్, మేడ్చల్, పంజగుట్ట, బంజారాహిల్స్, బోడుప్పల్‌లో వీరికి రెగ్యులర్‌ కస్టమర్లున్నారు. ఈ దంపతులు మరో ఇద్దరితో కలసి బోయిన్‌పల్లి ప్రాంతంలో మార్చి 12న గంజాయి అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీ సులు దాడి చేశారు. మాన్సీ, మదన్‌ పారిపోగా, ఇద్దరు యువకులతోపాటు 1.2 కిలోల గంజా యి దొరికింది. ఆ తర్వాత వీళ్లు గంజాయి విక్ర యించడం ఆపేసి హష్‌ ఆయిల్‌ దందా మొదలెట్టారు.
ఈ క్రమంలో హెచ్‌–న్యూ ఇన్‌స్పెక్టర్‌ పి.రమేశ్‌రెడ్డి, ఎస్సై సి.వెంకటరాములు గత గురువారం కొంపల్లి వద్ద మాన్సీని పట్టుకున్నారు. అప్పటి నుంచి మదన్, రాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ ఠాణా పరిధిలోని ఎర్రకుంటలో మదన్, రాజు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 24 కంటైనర్లలోని 120 గ్రాములు హష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నారు. 
ఈ నిందితులను విచారించగా పలువురు కస్టమర్ల వివరాలు బహిర్గతమయ్యాయి. 19 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్కులైన మొత్తం 18 మందిలో 9 మందిని అరెస్టు చేసి మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement