కరీంనగర్‌కు మచిలీపట్నం పోలీసులు? | Disabled Woman From Machilipatnam Alleges Molestation Case Enquiry Runs In Karimnagar | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి కేసు.. కరీంనగర్‌కు మచిలీపట్నం పోలీసులు?

Mar 22 2022 10:48 AM | Updated on Mar 22 2022 11:19 AM

Disabled Woman From Machilipatnam Alleges Molestation Case Enquiry Runs In Karimnagar - Sakshi

సాక్షి,కరీంనగర్‌క్రైం: మచిలీపట్నంలోని ఇనగదురుపేట పోలీసుస్టేషన్‌ పరిధికి చెందిన ఒక దివ్యాంగురాలి(40)పై కరీంనగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడినట్లు అక్కడి పోలీసులకు ఫిర్యాదు అందగా.. విచారణ నిమిత్తం కరీంనగర్‌కు చేరుకున్నట్లు తెలిసింది. వివరాలలోకి వెళ్తే.. దివ్యాంగురాలైన మహిళ మరో ఇద్దరితో కలిసి వంట పని కోసం గత ఫిబ్రవరిలో కరీంనగర్‌ వచ్చింది. (చదవండి: భర్త కోసం అందరినీ వదిలి వచ్చా.. ఇప్పుడు ఎవరూ లేరు )

తర్వాత ఆమె తిరిగి ఇంటికి చేరకపోవడంతో బాధిత కుటుంబసభ్యులు మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగంలోకి దిగి సదరు మహిళ సెల్‌ఫోన్‌ నంబర్‌ ఆధారంగా కరీంనగర్‌ బస్టాండ్‌ వద్ద ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలో మార్చి 09న ఆమె మచిలీపట్నం చేరుకుంది. ఆ దివ్యాంగ మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. కేసు నమోదవగా ఆరుపేట సీఐ బృందం కరీంనగర్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఆది, సోమవారాల్లో కరీంనగర్‌ బస్టాండ్‌ సమీపంలో, కొత్తపల్లి ఠాణా పరిధిలో కొంతమంది నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement