'అక్కడ చదవడం ఇష్టం లేదు.. ప్రైవేట్‌ కాలేజీకి పంపండి' | Degree Student Suicide In Ichoda Adilabad | Sakshi
Sakshi News home page

విషాదం: 'నాకు అక్కడ చదవడం ఇష్టం లేదు.. ప్రైవేట్‌ కాలేజీకి పంపండి'

Dec 4 2021 10:46 AM | Updated on Dec 4 2021 11:41 AM

Degree Student Suicide In Ichoda Adilabad - Sakshi

పూజ (ఫైల్‌)

సాక్షి, ఇచ్చోడ(బోథ్‌): తల్లిదండ్రులు ప్రైవేట్‌ కాలేజీకి పంపడం లేదని మనస్తాపం చెంది డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని తలమద్రిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై ఉదయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తలమద్రికి చెందిన గుల్లె శంకర్‌ కుమార్తె పూజ (19) ఇచ్చోడలోని సోషల్‌ వెల్ఫేర్‌ డిగ్రీ మహిళా కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది.

తనకు సోషల్‌ వెల్ఫేర్‌లో చదవడం ఇష్టం లేదని, ప్రైవేట్‌ కాలేజీకి పంపించాలని రెండు నెలలుగా కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు కోరిన కాలేజీకి పంపడం లేదని మనస్తాపం చెంది గురువారం కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.  

చదవండి: (చున్నీతో ప్రియుడిని నడుముకు కట్టుకుని.. కాలువలో దూకి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement