వర్క్‌ఫ్రమ్‌ హోం వలలో రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి.. లింక్‌ క్లిక్‌పై చేయడంతో... | Cyber Fraud In Chittoor District | Sakshi
Sakshi News home page

వర్క్‌ఫ్రమ్‌ హోం వలలో రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి.. లింక్‌ క్లిక్‌పై చేయడంతో...

Apr 3 2022 3:42 PM | Updated on Apr 3 2022 7:07 PM

Cyber Fraud In Chittoor District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సులభంగా అధికంగా డబ్బులు సంపాదించవచ్చంటూ సైబర్‌ నేరగాళ్లు విసిరిన వర్క్‌ఫ్రమ్‌ హోం వలలో చిక్కుకుని ఓ రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి రూ.20 లక్షలు కోల్పోయాడు. తీరా తనను దగా చేశారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

చంద్రగిరి(చిత్తూరు జిల్లా): సులభంగా అధికంగా డబ్బులు సంపాదించవచ్చంటూ సైబర్‌ నేరగాళ్లు విసిరిన వర్క్‌ఫ్రమ్‌ హోం వలలో చిక్కుకుని ఓ రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి రూ.20 లక్షలు కోల్పోయాడు. తీరా తనను దగా చేశారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. మండలానికి చెందిన ఓ రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి వర్క్‌ ఫ్రమ్‌ హోం పేరుతో వచ్చిన ఓ లింకును క్లిక్‌ చేశాడు.

చదవండి: చిన్నారి గొంతులో ఇరుక్కున్న ఉల్లి ముక్క.. ఆపస్మారక స్థితిలో..

వారి సూచనలు పాటించడంతో రూ.20 నుంచి రూ. 20లక్షల వరకు ఆన్‌లైన్‌ పేమెంట్‌ను చెల్లించాడు. రూ.20 లక్షలకు రూ.40 లక్షలు ఇస్తామని, రూ.40 లక్షలు పొందాలంటే తొలుత రూ.8 లక్షలు పన్ను చెల్లించాలని మెసేజ్‌ రావడంతో కంగుతిన్నాడు. మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే కొటాలకు చెందిన యువకుడు కూడా పెద్ద ఎత్తున నష్టపోయినట్లు పోలీసులకు తెలిసింది. ఆ యువకుడు పరువుపోతుందనే ఉద్దేశంతో ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదని సమాచారం. బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement